Helipad | సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Helipad | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని(Meeting place) నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతం సింగ్ పరిశీలించారు. సభ నిర్వహణ స్థలం, హెలిప్యాడ్ ను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు(any problems) లేకుండా చూడాలని పోలీస్ అధికారులను సీపీ ఆదేశించారు.

నర్సంపేట పట్టణం నుండి సభా స్థలం వరకు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శంకుస్థాపన(Foundation stone laying)లు చేసే ప్రాంతాల్లో కూడా పోలీస్ అధికారులు ఉండాలని సూచించారు. అనేక ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు ప్రమాదాలు జరగకుండా నివారించాలని తెలిపారు. అంబులెన్స్ ల‌ను సైతం సిద్ధం(Also ready) చేసి ఉంచాలని సూచించారు. వీరి వెంట వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రూ.1000 కోట్ల విలువైన అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపనలు :
సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు వస్తున్న సందర్భంగా నర్సంపేట పట్టణంలో రూ. 1000కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపనలు చేసే పరిస్థితి(situation) ఉన్నట్లు తెలిసింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పదేపదే పలు మీటింగ్ ల‌లో ప్రకటించారు.

Leave a Reply