Mid Day Lunch :  ఫ్రెండ్లీ కలెక్టర్​

 Mid Day Lunch :  ఫ్రెండ్లీ కలెక్టర్​

  • ఉంగుటూరు హైస్కూలో .. మిడ్​ డే మీల్​ తనిఖీ
  • విద్యార్థులతో కలెక్టర్​ ముచ్చట్లు

ఆంధ్రప్రభ,  ఉంగుటూరు  (కృష్ణాజిల్లా)

Mid Day Lunch

ఉన్నత  లక్ష్యాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు కృష్ణాజిల్లా కలెక్టర్​ డీకే బాలాజీ  ఉద్భోదించారు. కృష్ణాజిల్లా  ఉంగుటూరు (Unguturu)  మండలంలోని ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (ZPHS) బుధవారం  సందర్శించారు.  మధ్యాహ్నం భోజనం (Mid Day Meal)   పరిశీలించారు.

పాఠశాలలోని మెనూ (Menu) పరిశీలించి, ఆ ప్రకారమే విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని పాఠశాల యాజమాన్యాన్ని ఆరా తీయగా, మెనూ ప్రకారమే ఆహారం సిద్ధం చేసి పెడుతున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం (Lunch with Students)   చేసి కాసేపు ముచ్చటించారు.

అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ,  పాఠశాల స్థాయి నుంచే పాఠ్య పుస్తకాలు చదవటం (Books)  అలవాటు చేసుకోవాలని, అదే జ్ఞానానికి (knowledge) పునాది అని సూచించారు.

Mid Day Lunch

మార్కులు కోసం చదివే చదువులకన్నా భవిష్యత్తులో (Future)  నూతన ఆవిష్కరణలు చేసే జ్ఞానం కోసం పాటుపడాలన్నారు. పాఠ్యపుస్తకాల్లో చదివిన అంశాలు సొంతగా రాయటం అలవాటు చేసుకోవాలని, అదేవిధంగా తోటి విద్యార్థులతో  చర్చించడం ద్వారా సబ్జెక్టు ఎక్కువకాలం గుర్తుండేందుకు అవకాశం ఉంటుందన్నారు.

Mid Day Lunch

కమ్యూనికేషన్ నైపుణ్యాలు (Comunication Skils)  ఏ వృత్తిలోనైనా కీలక పాత్ర పోషిస్తాయని, ఈ నేపథ్యంలో మౌఖిక (ఓరల్),  రాతపూర్వక(రిటెన్) కమ్యూనికేషన్ లను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు చేరుకున్నారని, అటువంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అనిత, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.