ఆరేళ్లలో 18 వేల మంది మృతి…
ఆరేళ్లలో 18 వేల మంది మృతి…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హర్యానా ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. గడిచిన ఆరేళ్ల కాలంలో 17,973 మంది గుండెపోటు కారణంగా మృతి చెందినట్టు హర్యానా ప్రభుత్వం వెల్లడించింది. 2020 జనవరి నుంచి 2026 జనవరి మధ్య కాలంలో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గలవారు గుండెపోటుతో మృతి చెందారని తెలిపింది. అయితే యువతలో గుండెపోటు కారణంగా సంభవించిన మరణాలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 2020 జనవరి నుంచి 2026 జనవరి వరకు ఏ జిల్లా నుంచి ఎంతమంది, ఏ వయసు వారు గుండెపోటుతో మరణించారో తెలుపాలని ఎమ్మెల్యే ప్రభుత్వాని అడిగారు. ఆ మరణాలకు కరోనా వైరస్‌తో, కొవిడ్ వ్యాక్సినేషన్‌తో ఏమైనా సంబంధం ఉందా..? ఆ దిశగా ఏమైనా సర్వే చేపట్టారా..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు ప్రభుత్వం స్పదించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించలేదని, జిల్లాల వారీగా సేకరించిన సమాచారాన్ని సభలో ప్రకటించారు. ఏ సంవత్సరంలో ఎంతమంది గుండెపోటుతో మరణించారో తెలిపింది. సంవత్సరాల వారీగా చూస్తే, 2020లో 2,394 మరణాలు సంభవించగా, 2021లో 3,188, 2022లో 2,796, 2023లో 2,886, 2024లో 3,063, 2025లో 3,255 మరణాలు జరిగినట్లు తెలిపింది. 2026 జనవరిలో 391 గుండెపోటు మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
