UK Politics | బ్రిటన్‌లో రాజకీయ కలకలం..

UK Politics | బ్రిటన్‌లో రాజకీయ కలకలం..

పదేళ్లలో ఆరుగురు ప్రధానులు పదవికి గుడ్‌బై

UK Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బ్రిటన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మరోసారి రాజకీయ అనిశ్చితిపై చర్చ మొదలైంది.

గత పదేళ్ల కాలంలో ఇప్పటికే పలువురు ప్రధానులు పదవుల నుంచి వైదొలగగా, కీర్ స్టార్మర్ రాజీనామాతో ఆ సంఖ్య ఆరుకు చేరింది. వరుసగా ప్రధానుల మార్పు బ్రిటన్ రాజకీయ వ్యవస్థలో స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

రాజీనామా వెనుక ఉన్న కారణాలపై అధికారిక ప్రకటన కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కొత్త ప్రధానిని ఎంపిక చేసే ప్రక్రియపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిటన్ రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో ప్రపంచ దేశాల దృష్టి లండన్ వైపు మళ్లింది.