కొలనుపాకలో ఆరోగ్య శిబిరం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శారాజిపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ ప్రారంభించారు. ఉప సర్పంచ్ గొట్టం విజయేందర్ రెడ్డి, మండల వైద్యాధికారిణి హైమావతి ఆధ్వర్యంలో వైద్య బృందం ప్రజలను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ కార్యదర్శి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
