Rajya Sabha | రెండు గంటల సమయం కేటాయింపు

Rajya Sabha | రెండు గంటల సమయం కేటాయింపు
Rajya Sabha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. ఈ బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్ రెండు గంటల సమయం కేటాయించారు. సభ్యులు బిల్లుకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. చర్చ అనంతరం బిల్లుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
