హ్యాట్రిక్ సర్పంచ్ ఓం ప్రకాష్‌కు ఘన సన్మానం..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) గ్రామ పంచాయతీలో మూడోసారి సర్పంచ్‌గా విజయం సాధించిన ఆత్రం ఓం ప్రకాష్‌కు ఘన సన్మానం లభించింది. గతంలో రెండు సార్లు సర్పంచ్‌గా గెలిచి మళ్లీ ఈ నెల 11న జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ సాధించారు.

శుక్రవారం సిర్పూర్ (యు) లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తొడసం ధర్మారావు, ఇతర నాయకులు శాలువతో ఓం ప్రకాష్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మూడు సార్లు సర్పంచ్‌గా గెలవడం ఎంతో సంతోషకరమని, ప్రజలు నమ్మకం పెట్టి గెలిపించిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించమని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మడావి బొజ్జిరావు, సిడం సుభాష్, లింగారావు, గజానంద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply