sai pallavi| ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు

sai pallavi| ఫ్యాన్స్, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నేడు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి పుట్టిన రోజు. ఫ్యాన్స్, సెలబ్రిటీలు సాయి పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సాయి పల్లవికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. సాయి పల్లవి సెంథామరై తెలుగు, మలయాళం, తమిళ సినిమాలలో నటించింది. తెలుగులో ఈమెకు ప్రేమమ్, ఫిదా సినిమాలు మంచి గుర్తింపును తెచ్చాయి. ఈ సినిమాలలో ఆమె నటనకు గాను రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది.

నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (2026)లో సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. సాయి పల్లవి తనదైన శైలిలో సీత పాత్రకు న్యాయం చేస్తారని, పాత్రకు అవసరమైన గంభీరత, దైవత్వాన్ని ఆమె ప్రదర్శించగలరని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది.