మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందజేత ..
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను ఎన్డీఏ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు గుర్రం కొండ, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్,మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, 38 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సురభి బాలుతో కలిసి బాధితుని కుటుంబానికి ఎల్ ఓసీ అందజేశారు.
38వ డివిజన్, రామ మందిరం ప్రాంతానికి చెందిన ఈటె రాహుల్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 9 లక్షల 75 వేల ఎల్ ఓ సీను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓసీను అందజేయడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే
సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు బాదర్ల శివ, షేక్ కరిముల్లా సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
