వేసవి తాపానికి చలివేంద్రం..

పమిడిముక్కల, ఆంధ్రప్రభ : వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రెడ్డిపాలెం ఇందిరమ్మ కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “చలివేంద్రం” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ట్రాన్స్‌జెండర్ సోదరీమణుల నాయకత్వంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.

రెడ్డిపాలెం ఇందిరమ్మ కాలనీలో రోడ్డు పక్కన తాటాకు పందిరి ఏర్పాటు చేసి, దారిన వెళ్లే బాటసారులు, స్థానికులకు మజ్జిగ, చల్లటి నీటిని ఉచితంగా పంపిణీ చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలు క్యూలో నిలబడి మజ్జిగ స్వీకరించడం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రాన్స్‌జెండర్ సోదరీమణులు, ఇందిరమ్మ కాలనీ యూత్ సభ్యులను ఉయ్యూరు శివన్న సీఆర్పీఎఫ్ మేనేజర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీజ, అభి, షర్మిల, మున్ని, సుప్రియ, సుష్మ, భూమి, సునీత, అరవింద్, కార్తీక్, వెంకటేష్, శంకరమ్మ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply