శ్రమకు ఫలితం ఎప్పుడంటూ.. కలెక్టర్‌కు వినతి

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ లో హమాలీ కార్మికుల బిల్లులు ఇప్పించాలని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో హమాలీ కార్మిక సంఘం నాయకులు ,కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. మూడు నెలల రేషన్ బియ్యం తక్కువ సమయంలోనే ప్రజలందరికీ అందేలా రాత్రింబవళ్లు శ్రమించి తమ బాధ్యతలను నిర్వర్తించి బియ్యం, పంపిణీ చేసి కా రెండు నెలలు గడిచినా ఇప్పటికీ వారికి బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మన్నారు.

రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవించే హమాలీ కార్మికులు బిల్లులు అందక , కుటుంబ పోషణ, పిల్లల చదువులు, నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెండింగ్‌లో ఉన్న హమాలీ కార్మికుల బిల్లులను వెంటనే మంజూరు చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సరిగొమ్ముల సురేష్, శీలపాక నాగరాజు, బండారి మధు, దాసరపు మహేష్,బోట్ల సారంగం ,పాల్గొన్నారు .

Leave a Reply