మద్దిమడుగు బాధితులకు గువ్వల బాలరాజు చేయూత

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అచ్చంపేట నియోజకవర్గం, పదర మండల పరిధిలోని మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఐదు దుకాణాలను అచ్చంపేట మాజీ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గువ్వల బాలరాజు సందర్శించారు. ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే గతంలో ఉన్న విధంగానే రేకుల షెడ్లను తన సొంత ఖర్చుతో తిరిగి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంతో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటానని, అవసరమైన సహాయం అందిస్తానని గువ్వల బాలరాజు తెలిపారు. ఆయన వెంట స్థానిక నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.