చిన్నారులతో ఆత్మీయ విందు..

చిన్నారులతో ఆత్మీయ విందు..

ప్రతిభకు ప్రోత్సాహం..
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉదారత
‘కలలకు రెక్కలు’ కార్యక్రమానికి ప్రశంసలు..
విద్యార్థులకు డైరీల పంపిణీ..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలలో విశేష ప్రతిభ కనబరిచిన నందిగామ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఏ ఎం బి మాల్‌లో ఉన్న ది గ్రాండ్ లైన్ బుఫట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థి విద్యార్థులతో కలిసి ఆత్మీయంగా భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.

పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమని హోటల్ యాజమాన్యం అభినందించింది. ఈ సందర్భంగా హోటల్ వారు చిన్నారు ప్రతిభకు గుర్తుగా డైరీలను అందజేసి వారి విజయయాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.