పేదలకు సహాయం చేయడంలోనే నిజమైన తృప్తి: ఎంపీ మహేష్ యాదవ్
రూ.48 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. ప్రజల వినతులు స్వీకరించిన ఎంపీ
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: పేదలకు సహాయం చేయడంలోనే నిజమైన తృప్తి ఉందని ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ అన్నారు. ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం 60 మంది లబ్ధిదారులకు రూ.48 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్య సహాయం కోసం వచ్చిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో గత రెండేళ్లలో తన కార్యాలయం ద్వారా 1,500 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద సుమారు రూ.10 కోట్ల ఆర్థిక సహాయం అందించగలగడం సంతోషంగా ఉందన్నారు.
చెక్కులు అందజేసిన అనంతరం లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
