అంబలి త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు..

కడెం, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో అంబలి త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్ అన్నారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి. భూషణ్, నిర్మల్ డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ రమేష్‌రావు, ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేష్ యాదవ్‌లు సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు అంబలి సేవించడం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా నిరంతరం ఉచిత అంబలి పంపిణీతో పాటు చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న బొడ్డు గంగన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్దబెల్లల్ సర్పంచ్ ఈదుల తిరుపతి, జే. రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply