హర్షం వ్యక్తం చేస్తున్న వెలమ సంఘం నాయకులు
హర్షం వ్యక్తం చేస్తున్న వెలమ సంఘం నాయకులు
సీఎం చంద్రబాబుకు వెలమ సంఘం కృతజ్ఞతలు
పాయకాపురం, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపు సాధించిన చింతకాయల విజయ్ గెలుపు వెలమ సంక్షేమ సంఘానికి గొప్ప మలుపు అని విజయవాడ వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంటా శ్రీనివాస రావు హర్షం వ్యక్తం చేశారు. బుదవారం జరిగిన వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల విజయ్ను అభినందిస్తూ తీర్మానం చేశారు. వెలమ కులస్తుల సంక్షేమానికి చింతకాయల విజయ్ సహకారం అందించగలరని సమావేశం కోరింది.
ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గం తీర్మానించింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి డా.సిరిపురపు కిరణ్ కుమార్, కోశాధికారి గంటా శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి చింతకాయల నాగ సత్యనాహమూర్తి, ఉపాధ్యక్షులు రుత్తల వెంకటేశ్వర్లు, పూర్వపు కార్యదర్శి చింతకాయలు చిట్టిబాబు, మహిళా నాయకురాలు రుత్తల శ్రీలక్ష్మీ దేవి తదితరులు పాల్గొన్నారు.
