Bharath Bhushan | ఏపీ ప్రభుత్వ అధికారిక నియామకం
Bharath Bhushan | ఏపీ ప్రభుత్వ అధికారిక నియామకం
Bharath Bhushan |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భరత్ భూషణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. సినీ, టీవీ, నాటక రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
