వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న దేవాలయాలలో మంగళవారం శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా చౌటుప్పల్ పట్టణంలోని 9వ వార్డులో గల శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు దేవాలయ కమిటీ అధ్యక్షులు ముత్యాల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
పాటిమీది శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంతగళ్ల నాగరాజు, ఊడుగు రమేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, హారతి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తులకు ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పల్లకి సేవ, శోభాయాత్రలను కన్నులపండువగా నిర్వహించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, దేప రమ్య రాజు, బత్తుల వాణి విప్లవ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, పిల్లలమర్రి మధుసూదన్, పస్తం గంగారాములు, ఆలయ కమిటీల ప్రతినిధులు అనెమోని చంద్రయ్య, కలకుంట్ల శివకుమార్, పోలోజు రామాచారి, ఎన్నం బాలరాజు, సామిడి రాఘవరెడ్డి, మంచికంటి భాస్కర్, ముత్యాల మోహన్ రెడ్డి, ముత్యాల హనుమంత్ రెడ్డి, ఊడుగు శ్రీనివాస్ గౌడ్, బొడిగె బాలకృష్ణ, దండ అరుణ్ కుమార్, బొబ్బిళ్ళ మురళి, పోలోజు శ్రీధర్ బాబు, సుర్వి నరసింహ, దాచేపల్లి శ్రీనివాస్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

