ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగుల సంక్షేమ అంశాలపై వినతిపత్రం

పరకాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ వంశీకృష్ణకు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.

జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం, ఎన్‌సీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగ సంబంధిత న్యాయమైన సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగుల సంక్షేమ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న శాంతియుత ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఇందులో భాగంగా పరకాల ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం సిబ్బంది, ఎన్‌సీడీ సిబ్బంది సూపరింటెండెంట్ డాక్టర్ బి.వి. వంశీకృష్ణకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం ఉద్యోగులు రోజా, ప్రశాంత్, నాగమణి, రమేష్, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.