నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ
దస్తూరాబాద్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం గ్రామపంచాయతీలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఎండపెల్లి గంగన్న ఆధ్వర్యంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగన్న, పంచాయతీ కార్యదర్శి వంశీ, కారోబార్ శేఖర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
