ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ..

రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ కడవేనా సరిత-యుగేoధర్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉపాధి కూలీలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏ పిఓ. దుబ్బాసి విఠల్,ఫీల్డ్ అసిస్టెంట్. పనస శంకర్,ఉపసర్పంచ్. పున్నం రాజు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply