Ghantasala | పేదల అభ్యున్నతి కోసం..

Ghantasala | పేదల అభ్యున్నతి కోసం..

Ghantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో మాజీ శాసనసభ్యులు, స్వర్గీయ వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతిని రాధ–రంగా మిత్ర మండలి, కూటమి నేతల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. తొలుత వంగవీటి మోహనరంగా విగ్రహానికి టీడీపీ నేత తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), కోన హరీష్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తాడికొండ చిన్నా మాట్లాడుతూ… పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగా ఆదర్శంగా తీసుకుని నేటి యువత పని చేయాలని అన్నారు. వంగవీటి మోహన రంగా అనే వ్యక్తి ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. పేదలకు అండగా నిలిచేతత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిపెట్టిందన్నారు.

ఈ కార్యక్రమంలో పాపవినాశనం టీడీపీ నేత కుంపటి చిట్టిబాబు, శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షులు దాసం రామకృష్ణ, గోగినేనిపాలెం టీడీపీ అధ్యక్షులు కుంపటి సుబ్బారావు, ప్రముఖులు చాట్రాగడ్డ చిన్ని, తిరుములశెట్టి నంద కుమార్, సూరిబాబు, నాని, చింతల శివాజీ, వెంకట్రావు, శివాజీ, మాజీ ఉప సర్పంచ్ నాంజీ, టీడీపీ ఉపాధ్యక్షులు పోలిమెట్ల సురేష్, జనసేన పార్టీ నాయకులు కొండవీటి నాని, మాదాసు వినయ్, తాడికొండ సాయి తేజ, కొండవీటి కోటేశ్వరరావు, PACS డైరెక్టర్ గోపు రాఘవరాజు, కోన వెంకటేశ్వరరావు, జీళ్ళా శ్రీనివాస్, కటారి తాతయ్యా, మేక పుల్లయ్య, నవతా రాంబాబు, డాంగే కుమార్, ఘంటసాల గణేష్, తాడికొండ వీరబాబు, కొండవీటి శ్రీకృష్ణ, కుంపటి ప్రవీణ్, శేఖర్, నాదెళ్ల అనిల్, పోలిమెట్ల ప్రవీణ్, సాయి కుమార్, బుజ్జీ, సత్యం, గాదె వెంకటేశ్వరరావు, కాకాని, తుంగల సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply