దండేపల్లి పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ వేడుకలు..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి పోలీస్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దండేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య ను శాలువాలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై తహసినోద్దీన్ మాట్లాడుతూ దేశ భద్రత, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మహిళామణులు రాణిస్తూన్నారని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఆమెకు తినిపించారు, కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply