గంజాయి బ్యాచ్ అరెస్ట్
( గుడ్లవల్లేరు –, ఆంధ్రప్రభ)
గుడ్లవల్లేరు పోలీసులు తొమ్మిది మంది గంజాయి బ్యాచ్ ను పట్టుకున్నారు. వీరి నుంచి 3.100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయిని గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని .. గుడ్లవల్లేరు పోలీసులకు సమాచారం లభించింది. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన కొందరు యువకులు గుడ్లవల్లేరు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్టు గుడ్లవల్లేరు ఎస్ఐ ఎన్ వి వి సత్యనారాయణకు సమాచారం వచ్చింది. ఇక టెక్నికల్ ఎవిడెన్స్ తో ఈ యువకులపై నిఘా పెంచి ఖచ్చిత సమాచారంతో, కౌతవరం రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లో కొందరి దగ్గర గంజాయిని గుర్తించారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతో దాడి చేసి, గుడ్లవల్లేరు, పమిడిముక్కల, గుడివాడ , మచిలీపట్నం ప్రాంతాలకి చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎరుకపాటి సందీప్, బెజ్జం గిరీష్, నత్తా ధనేష్, దరిశనం విజయ్, దిరిశనం పవన్ కళ్యాణ్, పరిసే అజయ్, సాంబయ్య, మేకా మోక్షజ్ఞ, ప్రత్తిపాటి రాజేష్ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3 కేజీల 100 గ్రాములు గంజాయి, ఒక బైకు, 9 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. గుడ్లవల్లేరుకు చెందిన ముగ్గురు యువకులకు రాహుల్ అనే వ్యక్తి పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఈ సందర్భంగా గుడివాడ రూరల్ సీఐ ఎస్ ఎల్ ఆర్ సోమేశ్వరరావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల కొనుగోలు అమ్మకాలు, వినుయోగుదారుల పట్ల నిరంతరం నిఘా ఉంటుందని, వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

