2Young Cricketers | అసభ్య వీడియోల ఆరోపణలపై…

2Young Cricketers | అసభ్య వీడియోల ఆరోపణలపై…
2Young Cricketers | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీలంక అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రికెటర్లు మహిళలను అసభ్యకరంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు. ఈ ఘటన కొలంబోలోని ఓ హోటల్‌లో చోటుచేసుకోవడం సంచలనం రేపింది.
హోటల్ బాత్రూమ్‌లో మహిళలను రహస్యంగా వీడియోలు తీశారనే ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు క్రికెటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అరెస్టు అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళల వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేశారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా స్పందించలేదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
