సంక్షేమ పథకాల్లో రాష్ట్రం ముందంజ..

వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : సంక్షేమ పథకాలు అందించడం రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఖిలా వరంగల్ ఖుష్ మహాల్లో జరిగిన కార్యక్రమం లో పాల్గొన్న,వారు జెండా ఎగరవేసి వందనం సమర్పించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు వివిధ శాఖల్లో జరుగుతున్న పనులు, వాటి పురోగతి అభివృద్ధి పరమైన అంశాలు అన్ని విస్తృతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద, ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
