కౌన్సిలర్ గా గెలిపించండి.. ప్రజలకు రుణపడి ఉంటా..

కౌన్సిలర్ గా గెలిపించండి.. ప్రజలకు రుణపడి ఉంటా..

2 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కురిమిల్ల ప్రమీల రాములు..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 2 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమకు ఒకసారి అవకాశమిచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజలకు రుణపడి ఉంటామని సేవే లక్ష్యంగా పని చేస్తామని అభ్యర్థి కురిమిల్ల ప్రమీల రాములు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము గతంలో వార్డ్ మెంబర్ గా, ఎంపీటీసీగా పని చేసిన అనుభవం ఉందని నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్న తాము నీతి నిజాయితీతో పాలన అందిస్తామని కౌన్సిలర్ పదవిని ఒక బాధ్యతగా నెరవేరుస్తామని తమకు ఒకసారి అవకాశం కల్పించాలని కోరుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

2 వ వార్డ్ లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్య నిర్వహణ , చెత్తకుండీల ఏర్పాటు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు, త్రాగునీటి శాశ్వత పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనకు అహర్నిశలు కృషి చేస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో వార్డులో అధిక మొత్తంలో నిధులు తెప్పించి.. 2వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు.