అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలి

అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలి
-ఎంపీ వేం నరేందర్ రెడ్డి
కేసముద్రం, ఆంధ్రప్రభ: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న కోట్ల రూపాయల వేయంతో నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ వైద్యశాల, పాలిటెక్నిక్ , డిగ్రీ కళాశాలతో పాటు మున్సిపాలిటీలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను సందర్శించి పనులను ఎమ్మెల్యే మురళి నాయక్ రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకునీ భవన నమూనా, గదుల వివరాలు, సౌకర్యాల గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ 50 పడకల వైద్యశాల జిల్లా ప్రజలకు ఎంతో అవసరం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ వైద్యశాలను మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయితే జిల్లా వాసులకు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే లభిస్తాయి. అందుకే పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలి. అవసరమైతే కేంద్రం నుండి అదనపు నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాను అని తెలిపారు.
అదేవిధంగా నిర్మాణం జరుగుతున్న ఆయా కళాశాలలు ఎకడమిక్ ఇయర్ వరకు అందించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు, ఆర్టీసీ అథారిటీ సభ్యులు రావుల మురళీ, చిలువేరు సమ్మయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్ చిన్న వెంకన్న, ఇంజనీరింగ్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
