ఆరు గ్యారంటీలు గాలికి…

ఆరు గ్యారంటీలు గాలికి…
నర్సంపేట, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ (Scholarships, fee reimbursement) వెంటనే విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట ఆర్డిఓ కార్యాలయం అధికారికి వినతిపత్రం ఈ రోజు అందజేశారు.
ఈ సందర్బం గా ఏఐఎస్ ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్రం అజయ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందన్నారు. కేసీఆర్(KCR)ను గద్దె దించే పోరాటాల్లో ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని, నిరుద్యోగ సమస్య తీరుస్తామన్నారు. విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక్క సమీక్షా నిర్వహించలేదన్నారు.
విద్యా శాఖ మంత్రిని నియమించకుండా ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ విచ్చలవిడిగా ప్రైవేట్ యూనివర్సిటీలకు(private universities) అనుమతు లిస్తుందని ఆరోపించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెరలేపుతూన్నారన్నారు. ప్రజాపాలనా అని మాటల్లో చెపుతూ, ఆచరణలో అప్రజాస్వామ్య పాలనా కొనసాగుతుందనీ ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెడుతున్నార న్నారు. ఒకవైపు ధనిక రాష్ట్రం అంటూనే మరో వైపు ఖజానా ఖాళీ(empty treasury)గా ఉందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్న తీరు రేవంత్ రెడ్డి చేతగాని తనానికి నిదర్శనమన్నారు.
విద్యా రంగంలో ఉన్న అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ, ఫీజు నియంత్రణా చట్టం(Fee Control Act) తీసుకొస్తూ, విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమలో ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు జిల్లా నాయకులు పాలక పవన్, టౌన్ నాయకులు ఈశ్వర్, సందీప్, శ్రీనివాస్, సంపత్, మహేష్ పాల్గొన్నారు.
