చెన్నూరులో యూరియా కోసం రైతుల బారులు
చెన్నూర్ (ఆంధ్రప్రభ): ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తిరుమల గిడ్డంగుల వద్ద రైతులు భారీగా బారులు తీరారు. వ్యవసాయ శాఖ యూరియా పంపిణీ చేస్తామని ప్రకటించడంతో వేకువజామున నుంచే మండలంలోని పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషంగా నిలిచింది. రైతుల రద్దీతో గిడ్డంగి పరిసరాల్లో సందడి నెలకొనగా, యూరియా పంపిణీ సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
