FCDA | పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు

FCDA | పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు

FCDA | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

మంత్రులు నిర్మాణంలో ఉన్న ఎఫ్‌సీడీఏ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడొద్దని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్యాధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికత, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్య, ఉపాధి, పరిశ్రమలు, టెక్నాలజీ రంగాలను సమన్వయం చేస్తూ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply