అకాల వర్షాలకు నేలమట్టమైన మైసమ్మ ఆలయం
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ రెస్క్యూ స్టేషన్ పరిధిలో పాలవాగు సమీపంలో ఉన్న మైసమ్మ ఆలయం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా కూలిపోయి నేలమట్టమైంది. విషయం తెలుసుకున్న మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ వెంటనే స్పందించి ఆలయ పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు.
ఆయన ఆదేశాల మేరకు రెస్క్యూ ఇన్చార్జి తోట సంపత్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి ఆలయ నిర్మాణ పనులు యధావిధిగా కొనసాగిస్తున్నారు. తమ ఆరాధ్య దైవమైన మైసమ్మ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జీఎం రాధాకృష్ణకు, ఎస్ఓటు జీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లి సది, గణేష్ రామన్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
