Delhi Airport | స్వల్ప ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం

Delhi Airport | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు స్వల్పంగా ఒకదానికొకటి తాకిన ఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ విమానాలు స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
లేహ్ నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం గేట్‌లోకి ప్రవేశిస్తుండగా, హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన ఆకాశ ఎయిర్ విమానం వెనక్కి కదులుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక కారణాలు, సమన్వయం లోపం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు.
