తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. వారి పోరాట స్ఫూర్తి వల్లే నేడు మనకు స్వరాష్ట్ర ఫలాలు అందుతున్నాయని, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను సుభిక్షంగా తీర్చిదిద్దడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతిలో అమరవీరుల బలిదానం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

Leave a Reply