టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం…

టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలాజీ ఆరోగ్య వరదాయిని పథకానికి విరాళాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ తరఫున విరాళం అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బాలాజీ ఆరోగ్య వరదాయిని పథకానికి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రూ.10 లక్షల 1,116లను విరాళంగా అందజేశారు.
ఈ మొత్తాన్ని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు సత్యనారాయణకు శ్రీవారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీవారి భక్తుడు పరదాలమని కూడా పాల్గొన్నారు.
