ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి…
ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి…
రాప్తాడు, ఆంధ్రప్రభ : మన ఇళ్లతోపాటు ఇంటి ముందర చుట్టుపక్కల ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని గ్రామ ప్రజలకు ఎంపీడీవో విజయలక్ష్మి తెలియజేశారు. శనివారం రాప్తాడు మండలం యం. బండమీదపల్లి గ్రామ పంచాయతీ నందు స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంను నిర్వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు గ్రామంలోని వీధులను ప్రతిరోజు శుభ్రం చేయాలని సూచించారు.
మార్చ్ నెల థీమ్ మూల విభజన, వ్యర్థరహిత జీవనశైలి సంబంధించి ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త వెరు వేరుగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. శుభ్రత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి అని అన్నారు. ఉపాధ్యాయులు అధికారులు పాఠశాలలు ఇతర కార్యక్రమాల్లో జీరో వేస్ట్ పద్ధతులు పాటించాలని అన్నారు. స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ మానవహారం ర్యాలీ నిర్వహించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు అశోక్ బాబు అచ్యుతానంద బాబు పంచాయతీ కార్యదర్శి కుళ్ళాయి నాయుడు మండల ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు సీనియర్ నాయకులు బోయ వెంకట రాముడు వెంకటేష్ కేశవయ్య సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
