సింగిల్ విండో ఆవరణలో సహకార జెండా ఆవిష్కరణ

మోత్కూర్, ఆంద్రప్రభ : గ్రామీణ ప్రాంతంలో సహకార వ్యవస్థను పటిష్ట పరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకార శాఖను ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 29 నుండి జూలై 6 వరకు సహకార వారోత్సవాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం మోత్కూరు కార్యాలయ ఆవరణలో సహకార జెండాను అధ్యక్షులు పేలపూడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

అనంతరం సంఘ 35వ కార్యవర్గ సమావేశంలో సంఘ సభ్యుల నుంచి రావాల్సిన అప్పు బకాయలను వసూలు చేయాలని, ఎల్ టి లోన్లు , వాయిదా మీరిన వారికి ఈ పి చేయుటకు తీర్మానించారు.ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు కారుపోతుల ముత్యాలు, తాళ్ళపల్లి స్వామి, జిట్ట లక్ష్మయ్య, పురుగుల మల్లయ్య, దేవసరి రాములు, బండ పద్మ ,బ్యాంక్ సి ఈ ఓ కొనతం వరలక్ష్మీ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.