ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామంలో సిద్ది ఐ కేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామస్థులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరంలో వడ్లూర్ గ్రామ మాజీ సర్పంచ్ బాణాల నర్సింహారెడ్డి కుమార్తె డాక్టర్ జ్యోతి పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.
అవసరమైన వారికి మందులు పంపిణీ చేయగా, కంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు అద్దాలు కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తన్నీరు శరత్ రావు, మాజీ సర్పంచ్ బాణాల నర్సింహారెడ్డి, సర్పంచ్ పులి రమేష్, చెన్నడి సుధాకర్ రెడ్డి, అన్నడి ఆనంతరెడ్డి, కసాని నర్సయ్య, రాసూరి మల్లికార్జున్, కట్ట కొమురయ్య, కుక్కల రాములు, కసాని శ్రీనివాస్, బాణాల శేఖర్ రెడ్డి, పులి శ్రీకాంత్ తదితరులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
