extortion | విశ్రాంత ప్రొఫెసర్ ఇంట్లో దాడి.. నగలతో పరారీ

extortion | విశ్రాంత ప్రొఫెసర్ ఇంట్లో దాడి.. నగలతో పరారీ
extortion | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో ఈ దోపిడీ జరిగింది. ఇంట్లో పనికి చేరిన నేపాలీ జంట పథకం ప్రకారం ముఠా సభ్యులను రప్పించి దంపతులపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ ఇంట్లో పనికి చేరిన నేపాలీ జంట, పుట్టినరోజు వేడుకల నెపంతో తమ సహచరులను ఇంటికి పిలిపించినట్లు సమాచారం. అనంతరం దంపతులపై దాడి చేసి వారి చేతులు కట్టేసినట్లు తెలిసింది.
అలాగే దంపతులకు మత్తుమందు ఇచ్చిన దుండగులు ఇంట్లో ఉన్న నగలు, విలువైన వస్తువులు దోచుకుని పరారైనట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
