Exclusive | సెమికోలన్ గాయ‌బ్‌!

ఎందుకు మాయమవుతోంది
ప‌ర్యాయ‌ప‌దాల‌కు విరివిగా వినియోగం
వ్యాక‌ర‌ణ చిహ్నాల‌న్నీ క‌నుమ‌రుగు
క‌నుమ‌రుగు ద‌శ‌కు చేరిన సెమీకొల‌న్‌
ఇంగ్లిషు వ్యాఖ్య నిర్మాణంలో విరివిగా వాడ‌కం
ఇప్పుడు పూర్తిగా త‌గ్గిన ఆ ధోర‌ణులు
ఆవేదన‌ వ్య‌క్తం చేస్తున్న‌ భాషా పండితులు

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌:

ఆధునిక జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆహారవిహారాదులలోనే కాకుండా, భాష వినియోగంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విరివిగా ఉపయోగించే పదాలు ఇప్పుడు క‌నిపించ‌కుండా పోతున్నాయి. వీటిలో వ్యాకరణ చిహ్నాలకూ మినహాయింపేమీ లేదు. ఈ జాబితాలోకే సెమీ కొలన్‌(Semi-colon)(;).. చేరింది. ఇప్పుడిది కనుమరుగయ్యే దశకు చేరుకుందని బాషా నిపుణులు అంటున్నారు.

విరామ చిహ్నంగా ఉప‌యోగం..

ఆంగ్ల వ్యాకరణంలో సెమికోలన్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది ఒక విరామ చిహ్నం. ఒకే వాక్యంలోని సారూప్యత కలిగిన రెండు అంశాలను వేరు చేయడానికి సెమికోలన్‌ వినియోగిస్తారు. ఉదాహరణకు ‘పొద్దున్న ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది; అది 10 గంటలకు గమ్యానికి చేరుతుంది’ వీటి మధ్య కనిపిస్తున్న(;) చిహ్నమే సెమికోలన్‌. ఆంగ్ల వాక్యాల్లో ఒకప్పుడు విరివిగా ఉపయోగించే ఈ చిహ్నం ఇప్పుడు కనుమరుగవుతోంది. దీనికి పలు కారణాలున్నాయంటున్నారు ప‌రిశీల‌కులు..

20 ఏండ్ల నుంచి వాడ‌కం త‌గ్గించారు..

ఆంగ్ల భాష అభ్యాసానికి ఉపయుక్తమయ్యే సాఫ్ట్‌వేర్ బాబెల్ (Software Babel) సాగించిన ఒక అధ్యయనంలోని వివరాల ప్రకారం.. రెండు దశాబ్దాలుగా, ఇంగ్లిషు పుస్తకాల్లో సెమికోలన్ వాడకం త‌గ్గుతూ వ‌స్తోంది. ఒకప్పుడు రచయితలు సెమీకోలన్‌ను ఉప‌యోగించి, పరిపూర్ణ వాక్యాలను రూపొందించడానికి విరివిగా ఉపయోగించారు.

టాల్‌స్టాయ్ పుస్త‌కంలోని తొలి వ్యాఖ్యంలోనే..

లియో టాల్‌స్టాయ్ రాసిన ‘అన్నా కరెనినా’లో ప్రారంభ పంక్తిలోనే సెమికోలన్‌ కనిపిస్తుంది. ఆంగ్ల భాషలో సెమికోలన్ అనేది దగ్గరి సంబంధం కలిగిన రెండు వాక్యాలను ఒకే వాక్యంగా లింక్ చేయడానికి సాధారణంగా ఉపయోగిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా వాడకంలోనే లేకుండా చేస్తున్నారు. భాషా నైపుణ్యాల్లో క‌నుమ‌రుగు అవుతున్న ఈ చిహ్నంపై చాలామంది ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply