విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ సీఎండీ
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏపీఎస్పీడీసీఎల్ సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన వినియోగదారులు పాల్గొనవచ్చు. వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకురావడానికి 89777 16661 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
ఫిర్యాదు నమోదు సమయంలో విద్యుత్ సర్వీస్ నంబర్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో సర్కిల్ స్థాయిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఫోన్ నంబర్లు కూడా ప్రకటించారు. తిరుపతి 8712652679, చిత్తూరు 7993147979, నెల్లూరు 0861-2320427, అన్నమయ్య 94408 17449, కడప 08562 242457, కర్నూలు 73826 14308, నంద్యాల 73826 18976, అనంతపురం 91547 90350, శ్రీ సత్యసాయి 99637 07847 నంబర్లకు కాల్ చేసి సమస్యలు వివరించవచ్చు.
