Elkathurthy వామ్మో .. ఎలుగుబంటి
Elkathurthy వామ్మో .. ఎలుగుబంటి
- ముస్లిం కాలనీలో ఎలుగుబంటి సంచారం
ఎల్కతుర్తి (Elkathurthy), ఆంధ్రప్రభ
మండలంలోని సూరారం గ్రామంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ముస్లిం కాలనీలో మంగళవారం రాత్రి ఎలుగుబంటి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
గ్రామస్తుల కథనం ప్రకారం, మూడు రోజుల క్రితం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన కొందరికి ఎలుగుబంటి కనిపించడంతో వారు భయంతో పరుగులు తీశారు. అనంతరం నాలుగు రోజుల తర్వాత మళ్లీ ముస్లిం కాలనీలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
రాత్రి వేళల్లో ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయంగా ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. చిన్నారులు, వృద్ధుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎల్కతుర్తి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. గ్రామంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని గుర్తించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని వారు కోరుతున్నారు.
గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఎలుగుబంటి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
