నిరుపేదల ఆరోగ్యానికి భరోసా

సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక చేయూత
మైలవరం నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్ నుంచి 141 మందికి రూ.1.47 కోట్ల ఆర్ధికసాయం.
95 మందికి సీఎంఆర్ఎఫ్ రీ ఎంబర్స్ మెంట్ రూ.61.20 లక్షలు మంజూరు.
46 ఎల్.ఓ.సీల ద్వారా రూ.86.39 లక్షలు మంజూరు
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 141 మంది లబ్ధిదారులకు రూ.1,47,59,839లు ఆర్థిక సాయం మంజూరైనట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు.95 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.61,20,765 విలువైన రీ ఎంబర్స్ మెంట్ చెక్కులు మంజూరయ్యాయి. మరో 46 మందికి ఎల్.ఓ.సీల ద్వారా రూ.86,39,074లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ రీ ఎంబర్స్ మెంట్ చెక్కులను, ఎల్.ఓ.సీలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు.

రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాలకు చెందిన లబ్ధిదారులు ఇక్కడ చెక్కులు, ఎల్.ఓ.సిలు తీసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సీఎం గారి సందేశ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ రెడ్డిగూడెం మండలానికి 20 చెక్కులు, మైలవరం మండలానికి 25 చెక్కులు, జి.కొండూరు మండలానికి 24 చెక్కులు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 8 చెక్కులు, ఇబ్రహీంపట్నం మండలానికి 7 చెక్కులు, విజయవాడ రూరల్ మండలానికి 11 చెక్కులు మంజూరయ్యాయని వివరించారు.

పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలు వైద్య ఖర్చుల భారం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీగా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేస్తున్న సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.