Edapalli | పారదర్శకతకు పట్టం కట్టండి
ధర్మారం సర్పంచ్ అభ్యర్థి
Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి (Edapalli) మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మూడవ రోజు కోలాహలంగా మొదలైంది. శనివారం ఎడపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సుండు కిషన్ (Kishan) సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను అధికారుల సమక్షంలో బైతాపూర్ నామినేషన్ కేంద్రంలో దాఖలు చేశారు.
నామినేషన్ (Nomination) సమర్పించిన అనంతరం అభ్యర్థి మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

