POLICE | డ్రగ్స్ రహిత తిరుపతి లక్ష్యం

POLICE | డ్రగ్స్ రహిత తిరుపతి లక్ష్యం

ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడి
తరచూ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురిపై పీడీ యాక్ట్

POLICE | తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్‌, గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. పునరావృత నేరాలు చేస్తూ ప్రజాశాంతి భద్రతకు భంగం కలిగిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందడుగు వేసింది. ఈ క్రమంలో వరుసగా మాదకద్రవ్య కేసుల్లో చిక్కుకున్న ఆరుగురిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

డ్రగ్స్‌, క్రైమ్‌ ఫ్రీ తిరుపతి జిల్లానే తమ లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. నేరచరిత్ర గల వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచుతూ, ప్రతి సమాచారం పై వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తిరుచానూరు, శ్రీకాళహస్తి వ‌న్‌ టౌన్, టూ టౌన్, తడ పోలీస్ స్టేషన్ల పరిధిలో పునరావృతంగా నేరాలకు పాల్పడిన కేసులను పరిశీలించి PIT–NDPS & PD Act అమలు చేసినట్టు తెలిపారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, గంజాయి/డ్రగ్స్ విక్రయం, రవాణా గమనించిన వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని హామీ ఇచ్చింది.

పీడీ యాక్ట్ నిందితుల వివరాలు
కరణి సాయి కుమార్ (22), చెరుకుర్తి వంశీ (24), పైపూరి వేణుగోపాల్ (45), పి. పరందాము (58), సాడు హరి (28), నల్లూ మురళి (31)ల పై గంజాయి, మాదకద్రవ్యాలు, దొంగతనం, హింసాత్మక నేరాలతో సహా మొత్తం 2 నుంచి 13 వరకు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave a Reply