Question Paper Leak : ఏడుగురు అరెస్ట్ – ముగ్గురు ఉపాధ్యాయుల‌పై వేటు

జుక్క‌ల్ – తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు, పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిన్న కామారెడ్డి జిల్లాలో పేపర్ లీక్ అయింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను సిబ్బంది లీక్ చేశారు.

పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. ఆ ప్రశ్నలు సోషలో మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

కాగా, కొందరు ఉపాధ్యాయులు తమ పాఠశాలలో 100 శాతం ఫలితాలు సాధించేందుకు, ఇలా ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు బయటకు పంపి మాస్ కాపీయింగ్ కు పాల్పడేలా చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఓ విద్యార్థి తండ్రి, పాఠశాలలోని వాటర్ మ్యాన్‌తో కలిసి ప్రశ్నలు లీక్ చేసి చిట్టీలు పంపగా, ఈ విషయం తెలుసుకున్న కొంతమంది మీడియా ప్రతినిధులు ఆ ప్రశ్నలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ వ్యవహారంలో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు మీడియా ప్రతినిధులు, విద్యార్థి తండ్రి, వాటర్ మ్యాన్, అటెండ‌ర్ తో స‌హా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Leave a Reply