శాంతి, ప్రేమ, ఆశల కలియిక ఈస్టర్

శాంతి, ప్రేమ, ఆశల కలియిక ఈస్టర్

  • పునరుత్థానం మహిమను స్మరించుకుందాం
  • తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

తిరువూరు, ఆంధ్రప్రభ ; క్రైస్తవుల పవిత్ర పండుగైన ఈస్టర్ సందర్భంగా తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పునరుత్థానం ద్వారా ఆశ, ప్రేమ, శాంతి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేసిన ప్రభువైన జీసస్ బోధనలు ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఈస్టర్ పండుగ మనుషుల్లో నమ్మకం, ధైర్యం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక సందర్భంగా నిలుస్తుందని ఆయన అన్నారు. సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఈ పర్వదినం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, సుఖశాంతులతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుతూ, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు.

Leave a Reply