స్వతంత్ర సమరయోధుల వర్ధంతి కార్యక్రమాలు…
స్వతంత్ర సమరయోధుల వర్ధంతి కార్యక్రమాలు…
గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ సుందరయ్య భవన్‌లో స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు, వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.
వ్యసనాలకు బానిసలైన యువత భగత్ సింగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకొని, జీవితంలో మార్పు వచ్చింది దేశ ఉన్నతికి కృషి చేయాలని సిపిఎం నాయకులు ఆర్ సి పి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం, కొండ, గాంధీ, తదితరులు పాల్గొన్నారు.
