Dsc-War : గుంటూరులో హైటెన్షన్​ Andhra Prabha Top News

Dsc-War : గుంటూరులో హైటెన్షన్​ Andhra Prabha Top News

  • టీడీపీ..వైసీపీ డిఎస్సీ వార్​
  • గుజ్జనగుండ్ల కూడలిలో అల.జడి
  • మెగా డీఎస్సీ, రెండేళ్ల పాలనపై రాజకీయ రగడ
  • “వెన్నుపోటుకు రెండేళ్లు” వైసీపీ ఆందోళన
  • “రాక్షస పాలన ముగిసి రెండేళ్లు” టీడీపీ ప్రతిస్పందన
  • ఒకే ప్రాంతంలో రెండు పార్టీలు హోరాహోరీ
  • జగన్ దిష్టిబొమ్మ దహనం
  • వేడెక్కిన రాజకీయ వాతావరణం

( గుంటూరు బ్యూరో , ఆంధ్రప్రభ )

Dsc-War : గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల కూడలి గురువారం వేడెక్కిన రాజకీయ వేదికగా మారింది. మెగా డీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు ఒకే ప్రాంతంలో పోటాపోటీగా కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ ఆధ్వర్యంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు గుజ్జనగుండ్ల కూడలికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ హామీలు, ఉద్యోగాల భర్తీ, ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అదే సమయంలో టీడీపీ నాయకులు “వైసీపీ రాక్షస పాలన ముగిసి రెండేళ్లు పూర్తయ్యాయి” అనే నినాదంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఆ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వై యస్ . జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు ఒకే ప్రాంతంలో చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.