Excellence Award | డా.వల్లూరి ప్రియాంకకు ఎక్సలెన్స్‌ అవార్డు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గచ్చిబౌలిలోని గమన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగం స్పెషలిస్ట్‌గా వైద్య సేవలు అందిస్తున్న డా. ప్రియాంక వల్లూరికి తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది.

ఆదివారం కొండాపూర్‌లోని మాయా లగ్జరీ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2025 కార్యక్రమంలో ఈ అవార్డును సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఆమెకు అందజేశారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సమాజంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమైందని, తల్లి శరీరానికి ప్రాణం పోస్తే, ఆ ప్రాణాలను కాపాడి నిలబెట్టేందుకు వైద్యులు ఎంత‌గానే శ్రమిస్తారని పేర్కొన్నారు.

సమాజంలో గురువుల పాత్రతో పాటు, వైద్యుల పాత్ర కూడా ముఖ్యమైనదిగా పూర్వీకులు గుర్తించారని, అందుకే వైద్యో నారాయణో హరీ: అంటారని వివరించారు.

ఈ సందర్భంగా అవార్డునందుకున్న డా.ప్రియాంక ఆంధ్రప్రభతో మాట్లాడుతూ.. అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయని, ఈ అవార్డు లభించడం తన అదృష్టమన్నారు. అనంతరం డా.ప్రియాంకను పలువు రు అభినందించారు.